Prithvi Shah : పృథ్వీ షా అరుదైన రికార్డు

టీమిండియా ఓపెనర్‌ (Team India Opener), ముంబై బ్యాటర్‌ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు.

టీమిండియా ఓపెనర్‌ (Team India Opener), ముంబై బ్యాటర్‌ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది.