టీమిండియా (Team India) సీనియర్ బ్యాటర్ (Senior Batter) చటేశ్వర పుజారా (Chateshwara Pooja) పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా మరో సెంచరీతో సత్తాచాటాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 110 పరుగులు సాధించాడు. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును శతకంతో ఆదుకున్నాడు. పుజారా పోరాటంతో సౌరాష్ట్ర తొలి రోజు ఆటలో రాజస్థాన్‌పై పైచేయి సాధించింది. ఫామ్ కోల్పోయిన పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు.
అయితే కౌంటీల్లో ఆడడం ద్వారా ఫామ్ అందుకున్న పుజారా తర్వాత దేశవాళీ క్రికెట్ లోనూ రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. 243 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. ఇటీవల సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సెలక్టర్లు పుజారాను ఎంపిక చేయలేదు. యువక్రికెటర్లు రజత్ పటిదార్ , సర్ఫ్ రాజ్ ఖాన్ లకు పిలుపునిచ్చారు. అటు కెఎల్ రాహుల్ , జడేజా , శ్రేయాస్ అయ్యర్ గాయాలతో దూరమైన నేపథ్యంలో పుజారాను మిగిలిన మూడు టెస్టులకైనా ఎంపిక చేస్తారమో చూడాలి.