పంజాబ్ జట్టుకు మొదటి నుంచి కూడా బౌలింగే ప్రధాన సమస్యగా మారింది. ఆ లెక్కన బ్యాటింగ్ లో కూడా పంజాబ్ జట్టు అంత స్ట్రాంగ్ గా లేనప్పటికీ, కెప్టెన్ ధావన్, ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ల పెర్ఫామెన్స్ తో విజయాలను నెట్టుకొస్తున్నారు. జితేష్ శర్మ, సామ్ కరన్ లు పోరాడుతూ ఒకింత పర్వాలేదు అనిపిస్తుంది. లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తున్న తీరు, ఐ పి ఎల్ అభిమానుల్ని నెక్స్ట్ లెవెల్ లో మెస్మరైస్ చేస్తుంది.
ఈరోజు జరగబోయే మ్యాచ్, పంజాబ్ బౌలింగ్ కి లక్నో బ్యాటింగ్ కి మధ్య అనేది స్పష్టంగా కనబడుతుంది. కగిసో రబడా, అర్ష్ దీప్ సింగ్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్ వంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నా కూడా, పంజాబ్ ఎందుకో ప్రత్యర్థి టీమ్ కు పనిగట్టుకుని పరుగుల దాహాన్ని తీరుస్తూ ఉంది. లక్నోలో జరగబోయే మ్యాచులో, ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అనే ఫైట్ ను అభిమానులు వీక్షించబోతున్నారు.
రెండు జట్లు ఐ పి ఎల్ 2023 సీజన్ మొదటి నుంచి కూడా ప్రేక్షకుల నుంచి అటెన్షన్ కొట్టేస్తూ, టాప్ 4 లో నిలిచే టీమ్స్ గా ప్రెడిక్షన్స్ ను సంపాదించుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లాస్ట్ మ్యాచులో ఒక్క వికెట్ తేడాతో, చివరి బంతికి విజయాన్ని అందుకుని లక్నో మంచి కాన్ఫిడెన్స్ తో ఉంటే, చివరి ఓవర్ వరకు జరిగిన నైల్ బీటింగ్ మ్యాచులో గుజరాత్ చేతిలో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. ఈ గణాంకాల దృష్ట్యా, ఈరోజు మ్యాచులో గెలుపు ఈక్వేషన్ లక్నో పంజాబ్ లకు 60 40 అన్నట్టుగా ఉండబోతుంది.