నా బయోపిక్ లో నేనే నటిస్తా బాలీవుడ్ ఎంట్రీపై ద్రవిడ్

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 06:07 PM IST

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా….ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే తాజాగా ఓ ఇంటర్యూలో ద్రావిడ్ చేసిన కామెంట్సే దీనికి కారణం… ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో ధోనీ, కపిల్ దేవ్ , దంగల్ వంటి సినిమాలు అలరించాయి. తాజాగా యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ ఆధారంగా కూడా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కు సంబంధించి రాహుల్ ద్రావిడ్ పై కూడా బయోపిక్ వస్తే బావుంటుందనేది చాలా మంది అభిమానుల మాట. ఇదే విషయాన్ని మిస్టర్ డిపెండబుల్ ను అడిగితే ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. తన బయోపిక్ తీస్తే సంతోషమేనన్నాడు.

మరి హీరోగా ఎవరైతే బాగుంటారన్న ప్రశ్నకు ద్రవిడ్ ఫన్నీగా స్పందించాడు. మంచిగా డబ్బులిస్తే తన బయోపిక్ లో తానే నటిస్తానంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ది వాల్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంపైనా ద్రవిడ్ మాట్లాడాడు. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం కోసం భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదన్నాడు. పూర్తి ఉత్సాహంతో ఆడాలనుకున్నామని, ఆ రోజు కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకున్నట్టు వెల్లడించాడు. ఇక భారత్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆటగాడిగా భాగస్వామ్యం కాలేకపోవడం నిరాశ కలిగించినా …కోచ్‌గా పనిచేయడం ద్వారా ఫ్యాన్స్ ప్రేమను పొందానంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.