Yuzvendra Chahal: ద్రవిడ్‌, హార్ధిక్‌ని పీకి పడేయండి.. అసలు బుద్ధి ఉందా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!

వరల్డ్‌ కప్‌ దగ్గర పడుతున్నా ఇంకా ఎక్స్‌పిరిమెంట్స్‌ చేస్తుండడంపై ఓ వైపు అభిమానులు గుర్రుగా ఉన్న సమయంలో మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ద్రవిడ్‌. విండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా యుజువేంద్ర చాహల్ బ్యాటింగ్‌కి దిగిన సమయంలో హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్ హార్ధిక్ వ్యవహరించిన తీరు గల్లి క్రికెట్‌ను తలపించింది.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 06:35 PM IST

Yuzvendra Chahal: అంతర్జాతీయ క్రికెట్‌ని గల్లి లెవల్‌కి దిగజార్చారు ద్రవిడ్‌, హార్దిక్‌. విండీస్‌తో తొలి టీ20 సందర్భంగా ద్రవిడ్‌, హార్దిక్ చేసిన పనిని ట్రూ క్రికెట్ లవర్స్‌ తప్పుపడుతున్నారు.
16ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవమున్న రాహుల్ ద్రవిడ్‌పై గతేడాది కాలంగా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అడ్డగోలుగా టీమ్‌ని ఎడాపెడా మార్చడం.. వరల్డ్‌ కప్‌ దగ్గర పడుతున్నా ఇంకా ఎక్స్‌పిరిమెంట్స్‌ చేస్తుండడంపై ఓ వైపు అభిమానులు గుర్రుగా ఉన్న సమయంలో మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ద్రవిడ్‌. విండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా యుజువేంద్ర చాహల్ బ్యాటింగ్‌కి దిగిన సమయంలో హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్ హార్ధిక్ వ్యవహరించిన తీరు గల్లి క్రికెట్‌ను తలపించింది.

ఈ విషయాన్ని కొంతమంది జోక్‌గా తీసుకుంటుండగా.. ఇప్పటికే ద్రవిడ్‌పై మండిపోయి ఉన్న మరికొంతమంది మాత్రం లైట్‌గా తీసుకోవడం లేదు. సోషల్‌ మీడియా వేదికగా ద్రవిడ్‌, హార్దిక్‌ని ఏకిపడేస్తున్నారు. విండీస్‌తో తొలి మ్యాచ్‌ సందర్భంగా భారత్‌కు కరిబియన్‌ జట్టు 150 పరుగుల టార్గెట్‌ని సెట్ చేసింది. ఛేజింగ్‌లో టీమిండియా 19 ఓవర్లలో ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. 20వ ఓవర్ తొలి బంతికి కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 10వ బ్యాటర్‌గా యుజువేంద్ర చహల్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. క్రీజు వద్దకు చేరుకున్నాడు. ఇంతలోనే డగౌట్‌ నుంచి పిలుపు వచ్చింది. చహల్‌ని వెనక్కి రావాల్సిందిగా ద్రవిడ్‌, హార్దిక్‌ కోరారు. ఈ విషయాన్ని ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చహల్‌కు చేరవేశారు. ఏం జరుగుతుందో అర్థం అవ్వని చాహల్‌ తన స్థానంలో ముఖేశ్‌ కుమార్‌ని దింపాలని కోచ్‌, కెప్టెన్‌ నిర్ణయించుకున్నట్టు వెంటనే తెలుసుకున్నాడు. పరుగు పరుగున డగౌట్‌ వైపు వెళ్లిపోయాడు. ఇంతలోనే చాహల్‌ని అంపైర్ పిలిచాడు. అలా క్రీజులోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లకూడదని చెప్పాడు.
నిజానికి క్రీజులోకి వచ్చిన తర్వాత ఏ ఆటగాడు తిరిగి డగౌట్‌కి వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళ్తే అవుట్‌గా ప్రకటిస్తారు. లేకపోతే రిటైర్డ్‌ అవుట్‌గా డిక్లేర్‌ చేస్తారు. ఈ రెండిటిలో ఏది చేసినా చాహల్‌కి మరోసారి బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ ఉండదు. 16ఏళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన ద్రవిడ్‌కి ఈ విషయం తెలియదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత్‌ జట్టుకు వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన ద్రవిడ్‌ ఇలా చేయడం వల్ల క్రికెట్ ప్రపంచం టీమిండియాను చూసి నవ్వుతోందని వాపోతున్నారు. హార్దిక్‌కి అంటే తెలియకపోవచ్చు కానీ.. ఇలా అడ్డదిడ్డంగా ప్లాన్లు వేయడం ఏంటో కోచ్‌ గారికే తెలియలి. నిజానికి ముఖేశ్‌ కుమార్‌ హిట్టింగ్‌ చేయగలడు. చాహల్‌ చేయలేడు. మరో వికెట్‌ పడితే ముఖేశ్‌ బ్యాటింగ్‌కి వెళ్లాలో.. చాహల్‌ వెళ్లాలో ఆ ఇద్దరు ఆటగాళ్లకి ముందే ఎందుకు చెప్పలేదో దేవుడికే తెలియలి. ఈ మొత్తం సీన్‌లో చాహల్‌ జోకర్‌గా ట్రోల్ అయ్యాడు.