భారత క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే ఇక అతన్ని ఔట్ చేయడం కష్టం.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్ గా బౌలర్లకు తన బ్యాటింగ్ తో ఎన్నోసార్లు పీడకలలను మిగిల్చాడు. ఇప్పుడు ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్ తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు జూనియర్ ద్రవిడ్ సెలక్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌తో భారత్ యువ జట్టు మూడు వన్డేలు, నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత యువ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
సమిత్ ద్రవిడ్ మిడిలార్డర్ బ్యాటర్. ఇటీవల సీనియర్ మెన్స్ టీ20 టోర్నమెంట్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. మహారాజ టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన సమిత్ ద్రావిడ్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 114 స్ట్రైక్‌రేటుతో 82 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే
పుదుచ్చేరిలో వన్డే సిరీస్, చెన్నై వేదికగా నాలుగు రోజుల మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే జట్టుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమాన్ కెప్టెన్‌గా, రెడ్ బాల్ క్రికెట్‌కు మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్ధన్ సారథిగా ఎంపికయ్యారు.