Dhoni: ధోని రిటైర్ అయ్యేది అప్పుడే.. మహీ చెప్పిన మాటలు బయటపెట్టిన రైనా..

ఇప్పుడు ఐపీఎల్ గురించి చర్చ జరుగుతోంది.. ఎవరు కప్ నెగ్గుతారని కాదు.. ధోనికి ఇది లాస్ట్ సీజనా కాదా.. లేదంటే ఇంకా ఆడతాడా లేదా అని ! ఆల్‌మోస్ట్ ఫేర్‌వెల్ సీజన్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా. ఇంత జరుగుతున్నా ధోని ఏమైనా చెప్తున్నాడా అంటే.. నవ్వేసి ఊరుకుంటున్నాడు అంతే ! దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటతీరుపై ఎంత చర్చ జరుగుతోందో.. ధోనీ రిటైర్మెంట్‌పై కూడా అంతే చర్చ కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 08:08 PM IST

ధోని క్రీజ్‌లోకి వస్తే చాలు మహీ అరుపులతో స్టేడియాలు రీసౌండ్ ఇస్తున్నాయ్. ఐతే బద్దలవుతున్నాయ్. ధోనికి క్లోజ్‌ అని పేరు ఉన్న రైనా.. మహీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తనతో ఏమన్నాడో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత.. మరో ఏడాది పాటు ఆడిన తర్వాత రిటైర్ అవుతానని ధోని తనతో చెప్పినట్లు సురేష్‌ రైనా అన్నాడు. దీంతో ఇప్పట్లో రిటైర్‌ అయ్యే ఉద్దేశం ధోనీకి లేదని తెలుస్తోంది. ఇదే నిజమైతే మహీ అభిమానులకు ఇది జోష్‌ నింపడం ఖాయం.

ఈ మధ్య లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ వేసే సమయంలో.. చివరి సీజన్‌ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కామెంటేటర్ అడిగితే.. అది మీరే డిసైడ్ చేశారు అని ధోని ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడే అభిమానుల్లో ఆనందం కనిపించింది. ఇప్పుడు రైనా మాటలతో ఆ ఆనందం రెట్టింపు అయినట్లుఅయింది. ఏమైనా ధోనీ లేని చెన్నై జట్టును ఊహించుకోవడం కూడా కష్టంగా మారింది చాలామందికి.