Ravichandran Ashwin: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్ అనిల్ కుంబ్లే. ఆయన కూడా స్పిన్ బౌలింగ్‌తోనే ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్సులో రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ తీశాడు. దీంతో అశ్విన్ 500 వికెట్ల క్లబ్బులో చేరాడు.
Malla Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు.. మిషన్ మొదలు పెట్టేశారా? మల్లారెడ్డి మాటలతో కొత్త రచ్చ..
తక్కువ మ్యాచుల్లోనే 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన వారిలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నారు. మురళీ ధరన్ కేవలం 87 టెస్టుల్లోనే 500 వికెట్లు తీశాడు. తర్వాతి స్థానం అనిల్ కుంబ్లేది. ఆయన మొత్తంగా 619 వికెట్లు తీశాడు. అశ్విన్ ఖాతాలో మరికొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మ్యాచులో ఐదు వికెట్లు 34 సార్లు తీశాడు. అలాగే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కూడా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు. అంతకుముందు ఈ రికార్డు చంద్రశేఖర్ పేరిట ఉండేది. ఆయన 38 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్‌పై 95 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు.
అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లు తీశాడు. వీరి తర్వాతి స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఆయన ఇంగ్లండ్‌పై 92 వికెట్లు తీశాడు. ఇక ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 98 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ మరో రెండు వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్‌పై వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇంగ్లండ్‌తో ఇండియాకు మరో రెండు టెస్టులున్న నేపథ్యంలో ఈ రికార్డు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది.