Ravichandran Ashwin: వందో టెస్టులో అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్

తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్‌ క్రాలీ, డకెట్‌, పోప్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లిష్‌ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్‌ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 04:53 PM IST

Ravichandran Ashwin: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అదరగొట్టాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడిన అశ్విన్‌.. తన స్పిన్‌ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్‌ క్రాలీ, డకెట్‌, పోప్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లిష్‌ జట్టును దెబ్బతీశాడు.

IND VS ENG: ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం..

ఓవరాల్‌గా అశ్విన్‌ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులెక్కాడు. అశ్విన్‌ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్‌లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్‌ సాధించాడు.

తాజా మ్యాచ్‌లో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. ఈ సిరీస్ మొత్తం అశ్విన్ అద్భుత ఆటతీరు కనబరిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో విజయం సాధించింది. సిరీస్ 4-1తో కైవసం చేసుకుంది.