Ravindra Jadeja: టీమిండియా దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్టుకు జడ్డూ డౌటే

రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను రనౌట్‌ కావడమే కాకుండా రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జడేజాను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి పంపించాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 04:48 PM IST

Ravindra Jadeja: ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. తొలి టెస్ట్‌ ఆడుతుండగా తొడ కండరాలు పట్టేయడంతో స్టార్‌ ఆటగాడు రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను రనౌట్‌ కావడమే కాకుండా రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జడేజాను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి పంపించాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులకు మోదీ సూచనలు

జడేజా గాయం తీవ్రతపై అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయంపై స్పందించేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నిరాకరించాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఇప్పటికే విశాఖకు చేరుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించి కూడా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్‌సేన విఫలమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలే పోప్‌ను త్వరగా ఔట్ చేయలేకపోవడంతో అతను 196 రన్స్ చేసి జట్టుకు భారీస్కోర్ అందించాడు. 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా చేతులెత్తేసింది. స్పిన్ పిచ్‌పై మన బ్యాటర్లు నిరాశపరిచారు. రోహిత్ , గిల్, శ్రేయాస్ అయ్యర్ , జడేజా విఫలమయ్యారు.

అయితే జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద తొడ కండరాలు పట్టేయడంతో పరుగు తీసే క్రమంలో జడ్డూ రనౌటయ్యాడు. జడ్డూ రనౌట్‌ కావడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. తర్వాత టెయిలెండర్లు కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. అసలే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్‌లో వెనుకబడిన భారత్‌కు ఆల్‌రౌండర్ జడేజా దూరమైతే గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.