Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ చేసినా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కని జైస్వాల్

557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ టీమ్.. జడేజా స్పిన్ దెబ్బకి కేవలం 122 పరుగులకే చాపచుట్టేసింది. ఒక రోజు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా సెంచరీతో పాటు మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 02:35 PM IST

Yashasvi Jaiswal: రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌‌పై భారత్ 434 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్‌ టీమ్.. జడేజా స్పిన్ దెబ్బకి కేవలం 122 పరుగులకే చాపచుట్టేసింది. ఒక రోజు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా సెంచరీతో పాటు మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.

Arvind Dharmapuri: నియంత అర్వింద్ వెళ్లిపో.. నువ్‌ మాకొద్దు.. బీజేపీ నేతల తిరుగుబాటు..

ఈ క్రమంలో జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరించింది. అయితే జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కడంపై ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం జడ్డూకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వడం సరైన నిర్ణయమంటుంటే.. మరో వర్గం డబుల్‌ సెంచరీ వీరుడు యశస్వీ జైశ్వాలే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌కు అర్హుడని అభిప్రాయపడుతున్నారు. జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీ సాధించికపోయి ఉంటే భారత్‌కు అంత భారీ ఆధిక్యం లభించేది కాదని పోస్ట్‌లు చేస్తున్నారు.

జైశ్వాల్‌కు అన్యాయం చేశారని ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌‌ను ఎక్స్‌లో తెగ ట్రెండ్‌చేస్తున్నారు. అంతకముందు రెండో టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు కూడా జైశ్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.