Royal Challengers Bangalore: ఆర్‌సీబీకి మళ్లీ అదే టెన్షన్.. కప్ కల సాకారమవుతుందా ?

ఆర్‌సీబీకి బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు లేకున్నా బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు లోపాలు కనిపిస్తాయి. ఈ సారి వేలం తర్వాత బెంగళూరు స్పిన్ డిపార్ట్మెంట్ వీక్‌గానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 04:23 PM IST

Royal Challengers Bangalore: ఈ సాలా కప్ నమదే.. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్లోగన్ ఇది. అయితే గత సీజన్‌లో కూడా ట్రోఫీ కల మాత్రం నెరవేరలేదు. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నా టైటిల్ మాత్రం గెలవలేకపోతోంది. తాజాగా ఐపీఎల్ మినీ వేలం తర్వాత బెంగళూరు జట్టు బలబలాలపై ఎనాలసిస్‌ను చూస్తే ఎప్పటిలానే లోటు భర్తీ చేసుకోవడంలో విఫలమైనట్టే కనిపిస్తోంది.

Rohit Sharma: ముంబై కాకుంటే నేను ఆడే జట్టు ఇదే.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఆర్‌సీబీకి బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు లేకున్నా బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు లోపాలు కనిపిస్తాయి. ఈ సారి వేలం తర్వాత బెంగళూరు స్పిన్ డిపార్ట్మెంట్ వీక్‌గానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న నలుగురు స్పిన్నర్లలో కరణ్ శర్మ తప్పిస్తే ఆధారపడదగ్గ మరో స్పిన్నర్ కనిపించడం లేదు. మయాంక్ దగార్, హిమాన్షు శర్మ, స్వప్నిల్ సింగ్ మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనలు ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో వచ్చే సీజన్‌లోనూ ఆ లోటే వీరికి బలహీనంగా మారే అవకాశముంది. పేసర్లలో సిరాజ్, టాప్లీకి తోడు ఫెర్గ్యుసన్, అల్జెరీ జోసెఫ్ కీలకం కానున్నారు.

ప్రతీసారీ పేసర్లే మ్యాచ్ లు గెలిపించలేరు. ఫార్మాట్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లే కీలకం. ఈ నేపథ్యంలో బెంగళూరు స్పిన్‌పై ఎందుకు ఫోకస్ పెట్టలేదన్నది అర్థం కాని ప్రశ్న. టైటిల్ గెలవాలంటే అన్ని విభాగాలు బలంగా ఉండాలన్న లాజిక్ బెంగళురు మిస్ అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి వచ్చే సీజన్‌లోనైనా ఈ లోపాన్ని అధిగమించి ఆర్‌సీబీ కప్ గెలుస్తుందేమో చూడాలి.