RCB Vs KKR Match: రెండో మ్యాచులో రెచ్చేదెవరు?

ఛాలెంజర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది, మరియు వారి సొంత గ్రౌండ్ ఐన బెంగళూరు వారికీ బాగా కలిసొచ్చే ప్రాంతం. మరోవైపు KKR బౌలర్లు అత్యుత్తమ ఫామ్‌లో లేరు, ఇది ఆల్రెడీ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లకు క్యాష్ చేసుకునే అవకాశం. టాస్ గెలిచిన తర్వాత మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు సులువుగా మారే అవకాశం ఉంటుంది. ఛేజింగ్ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ అని క్రికెట్ వర్గం కోడై కూస్తుంది.

  • Written By:
  • Publish Date - April 26, 2023 / 02:15 PM IST

బెంగళూరు బ్యాట్స్ మెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. ఫాఫ్ IPL 2023లో అత్యధిక రన్-స్కోరర్‌గా ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్, ఏడు మ్యాచ్‌ల్లో 67.50 సగటుతో, 165.31 స్ట్రైక్-రేట్‌తో 405 పరుగులు చేశాడు.

ఉమేష్ యాదవ్, విరాట్ కోహ్లీ మధ్య ఇటీవలి కాలంలో హోరాహోరీ పోరు సాగుతోంది. రైట్ ఆర్మ్ సీమర్ గత IPL నుండి అద్భుతమైన కొత్త బాల్ బౌలర్‌గా అభివృద్ధి చెందాడు. KKR జట్టుపై గత రెండు సీజన్లలో కోహ్లీ సరిగ్గా ఆడలేదు. కె కె ఆర్ తో జరిగిన ఈ సీజన్ మ్యాచులో కూడా కోహ్లీ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. కానీ, ఈ ఏడాది అతని ఫామ్ ఆకట్టుకుంది. KKR స్పిన్నర్లు ఆ జట్టు తీసిన 10 వికెట్లలో 9 వికెట్లు తీశారంటే కలకత్తా స్పిన్ సామర్థ్యం ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తోంది.

నరైన్, చకరవర్తితో పాటు అరంగేట్రం చేసిన సుయాష్ శర్మ మంచి పెర్ఫామెన్స్ కనబరుస్తున్నారు. వీరితో పాటు లార్డ్ శార్దూల్ ఠాకూర్‌ను మరచిపోకూడదు, అతను ఒక మెరుపు నాక్‌తో ఆర్సిబిని ఆటాడుకున్న సంగతి మరచిపోలేము. ఈరోజు జరగబోయే మ్యాచ్, ఖచ్చింతంగా రాయల్ ఛాలెంజెర్స్ బ్యాటింగ్ కి, కలకత్తా బౌలింగ్ కి మధ్య జరగనుంది.