IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టామ్ కర్రన్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు మరో ఇంగ్లీష్ ప్లేయర్ గాయం కూడా ఆర్సీబీని టెన్షన్ పెడుతోంది.
IND VS ENG: ఎన్నాళ్లకు ఛాన్స్.. మూడో టెస్టులో వారిద్దరి అరంగేట్రం?
ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టాప్లీ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న టోప్లీ.. ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు దూరం కాగా.. త్వరలోనే జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడే అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్ లో కూడా అతడు ఆడేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే.. టోప్లీ ఐపీఎల్ 2023 సీజన్ తో ద్వారా రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.మినీ వేలంలో అతడిని 1.90 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
అయితే కేవలం ఒక్క మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు. కాగా, టాప్లీ గతంలోనూ కీలక టోర్నీలకు గాయాల కారణంగా దూరమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ , వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లాండ్ జట్టులో భాగమైన టాప్లీ.. గాయాల కారణంగా ఆ మెగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ నుంచీ కూడా టాప్లీ తప్పుకుంటే బెంగుళూరు టీమ్ గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.