Virat Kohli: పరుగుల వేటలో ఈ ఏడాది మనోళ్లే టాప్.. అదరగొట్టిన ఆటగాళ్లెవరంటే..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఆదరగొట్టేశారు. ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక టాప్ పరుగులు చేసిన ముగ్గురు టాప్ ఆటగాళ్లు భారత క్రికెటర్లే.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 04:54 PM IST

Virat Kohli: కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. 2023కు వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. 2023లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలవకున్నా మంచి విజయాలే అందుకుంది. ముఖ్యంగా పరుగుల వేటలో మన ఆటగాళ్ళ హవా కొనసాగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఆదరగొట్టేశారు. ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక టాప్ పరుగులు చేసిన ముగ్గురు టాప్ ఆటగాళ్లు భారత క్రికెటర్లే.

Yuvraj Singh: టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేది భారత్ కాదు: యువరాజ్ సింగ్

యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అధిగమించి పరుగులు చేశాడు. 29 మ్యాచులు ఆడిన గిల్ 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1584 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గానూ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో ఈ ఏడాది కోహ్లి కూడా తన సత్తా చూపించాడు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం 27 వన్డేలు ఆడిన కోహ్లి 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1377 పరుగులు చేశాడు. ముఖ్యంగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లి చెలరేగిపోయాడు. 11 మ్యాచ్‌లలో ఏకంగా 95కు పైగా సగటుతో 765 రన్స్‌తో టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా కోహ్లి బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ రికార్డు కూడా కోహ్లిదే.

ఇక ఇదే జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 27 వన్డేలు ఆడి 1255 పరుగులు చేశాడు. 2023లో వన్డే క్రికెట్‌ అత్యధిక పరుగుల జాబితా టాప్ 3లో భారత క్రికెటర్లే నిలవడం ఫ్యాన్స్‌లో మంచి జోష్ నింపింది. న్యూ ఇయర్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని వారంతా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.