వరల్డ్ క్రికెట్ లో రిచ్చెస్ట్ క్రికెటర్లు ఎవరంటే అందరూ సచిన్ అనో, ధోనీ లేక కోహ్లీ అన్నో ఠక్కున చెప్పేస్తారు… ఈ సారి మాత్రం వారి సమాధానం రాంగ్ అయినట్టే.. ఎందుకంటే సచిన్ , ధోనీ, కోహ్లీ ఆస్తుల కంటే ఆ యువక్రికెటర్ ఆస్తులే ఎక్కువ… ఆ యంగ్ ప్లేయర్ ఎవరో కాదు ఆర్యమన్ బిర్లా…. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా నిలిచాడు. ఆర్యమన్ బిర్లా నికర ఆస్తి విలువ 70 వేల కోట్లకు పైగానే ఉంది. సచిన్ ఆస్తుల నికర విలువ దాదాపు 1,100 కోట్లుగా ఉంటే…స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి నికర ఆస్తి విలువ 900 కోట్లుగా ఉంది. ఇక భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోనీ సంపద 800 కోట్లు మాత్రమే. ఆర్యమన్ ఆస్తి విలువ ముందు మన దిగ్గజ క్రికెటర్లు ఆస్తులు చాలా చాలా తక్కువ.
సచిన్, కోహ్లి, ధోనీల మొత్తం నికర ఆస్తులను కలిపినా ఆర్యన్ ఆస్తిలో పది శాతం కూడా లేదు. 2017లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆర్యమాన్ బిర్లా మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ టోర్నీల్లో ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 414 పరుగులు చేశాడు. 2018లో రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్‌ను 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా అతను 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మానసిక సమస్యలతో ఆటకు గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం తండ్రి వారసత్వాన్ని అందుకుని వ్యాపారరంగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు.