ఎవర్రా మీరంతా ? ఫేక్ ప్రచారంపై పంత్ ఫైర్

ఐపీఎల్ మెగా వేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ లోపు ఫ్రాంచైజీలు తన రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేసుకుంటున్నాయి. సందట్లో సడేమియాలా ఫ్రాంచైజీల రిటైన్ లిస్టులపై సోషల్ మీడియాలో రోజుకో వార్త షికారు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 07:21 PM IST

ఐపీఎల్ మెగా వేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ లోపు ఫ్రాంచైజీలు తన రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేసుకుంటున్నాయి. సందట్లో సడేమియాలా ఫ్రాంచైజీల రిటైన్ లిస్టులపై సోషల్ మీడియాలో రోజుకో వార్త షికారు చేస్తోంది. దీనిలో భాగంగా పలువురు స్టార్ ప్లేయర్స్ వేరే జట్టులోకి వెళుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆర్సీబీ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై పంత్ తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. ట్విట్టర్ వేదికగా ఫేక్ ప్రచారంపై రిప్లై ఇచ్చాడు. ఇది దారుణమంటూ మండిపడ్డాడు. కారణం లేకుండా ఇలాంటి గొడవలు క్రియేట్ చేయొద్దని హితవు పలికాడు. తాను చెప్పకపోతే ఇది ఎప్పటికీ ఆగదని అర్థమైందన్న పంత్ దయచేసి ఏదైనా ట్వీట్ చేసే ముందురీచెక్ చేసుకోవాలని కోరాడు.

రోజురోజుకీ సోషల్ మీడియా దారుణంగా తయారవుతోందనీ, మిగిలింది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. పంత్ ట్వీట్ తో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తోనే కొనసాగనున్నాడని తేలిపోయింది. కాగా ఐపీఎల్ 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ తొలిసారి ఫైనల్ చేరింది. తర్వాతి సీజన్ నుంచి పంత్ కే ఢిల్లీ యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ ఐపీఎల్ తోనే రీఎంట్రీ ఇచ్చి పరుగుల వరద పారించాడు. ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యువ వికెట్ కీపర్ నే కెప్టెన్ గా కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ డిసైడ్ అయింది.