నువ్వు మామూలోడివి కాదు కిందపడి సిక్సర్ బాదిన పంత్

ఆసీస్ పిచ్ పై చెలరేగిపోయే పంత్ పెర్త్ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత టాపార్డర్ బ్యాటింగ్ ఫ్లాప్ అయిన వేళ నితీశ్ రెడ్డితో కలిసి కీలక పార్టనర్ షిప్ తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 08:01 PM IST

ఆసీస్ పిచ్ పై చెలరేగిపోయే పంత్ పెర్త్ టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత టాపార్డర్ బ్యాటింగ్ ఫ్లాప్ అయిన వేళ నితీశ్ రెడ్డితో కలిసి కీలక పార్టనర్ షిప్ తో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. కాగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో పంత్ సాధించిన సిక్సర్ టీమిండియా ఇన్నింగ్స్‌లోనే హైలైట్‌‌గా నిలిచింది. 42వ ఓవర్‌‌లో కమిన్స్ ఆఖరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ వైపుగా వేశాడు. పంత్ తన ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా స్కూప్ షాట్‌ బాదాడు. అయితే ఈ క్రమంలో పంత్ అదుపుతప్పి తొలుత మోకాలిపై, ఆ తర్వాత కిందపడిపోయాడు. పంత్ కిందపడిన కొన్ని సెకన్ల తర్వాత బంతి స్టాండ్స్‌లోకి పడింది.పంత్ అద్భుతమైన షాట్‌కు వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు. కిందపడీ మరీ సిక్సర్ భలేగా కొట్టాడంటూ కితాబిచ్చారు.