త్రో సరిగ్గా వేయమని చెప్పు లిట్టన్ కు ఇచ్చిపడేసిన పంత్

భారత్ , బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో పేస్ పిచ్ పై భారత బ్యాటర్లు తడబడ్డారు. టాపార్టర్ విఫలమవడంతో రిషబ్ పంత్, జైశ్వాల్ జట్టును ఆదుకున్నారు. వీరి పార్టనర్ షిప్ బలపడడంతో బంగ్లా ఆటగాళ్ళు స్లెడ్జింగ్ కు దిగారు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 03:04 PM IST

భారత్ , బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో పేస్ పిచ్ పై భారత బ్యాటర్లు తడబడ్డారు. టాపార్టర్ విఫలమవడంతో రిషబ్ పంత్, జైశ్వాల్ జట్టును ఆదుకున్నారు. వీరి పార్టనర్ షిప్ బలపడడంతో బంగ్లా ఆటగాళ్ళు స్లెడ్జింగ్ కు దిగారు. నిలకడగా ఆడుతున్న పంత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వికెట్ కీపర్ లిట్టన్ దాస్ గొడవకు దిగాడు. బంగ్లా బౌలర్‌ టస్కిన్‌ అహ్మద్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఈ గొడవ జరిగింది. ఫీల్డర్‌ త్రో విసిరిన బాల్‌ పంత్‌ ప్యాడ్‌కు తగిలి.. మిడ్‌ వికెట్‌ వైపు వెళ్లింది. దాంతో పంత్‌ ఎక్స్‌ట్రా రన్‌ కోసం ప్రయత్నించగా.. జైస్వాల్‌ నో చెప్పడంతో క్రీజ్‌లోకి తిరిగి వచ్చాడు. అయితే.. బంగ్లా కీపర్‌ లిట్టన్‌ దాస్‌.. దానికి రన్‌ ఎలా తీస్తావ్‌ అంటూ పంత్‌కు నీతులు చెప్పబోయాడు.

దీనికి పంత్ గట్టిగానే ఇచ్చిపడేశాడు. మరి బాల్‌ వికెట్లకు వేయండి.. నన్నేందుకు కొడుతున్నారు అంటూ పంత్‌ కౌంటర్‌ ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు. కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. లిట్టన్ దాస్ రెచ్చగొట్టిన తర్వాత పంత్ గేర్ మార్చి భారీ షాట్లు ఆడాడు. కారు యాక్సిడెంట్ తర్వాత దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరమైన పంత్ వైట్ బాల్ ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఇప్పుడు 629 రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లో కూడా అడుగుపెట్టిన పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 39 రన్స్ చేశాడు.