Rishabh Pant: స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన పంత్.. అప్పటి నుంచీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నాల్లో ఉన్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌తో అతడి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడని కచ్చితంగా నమ్ముతున్నట్టు పాంటింగ్ చెప్పాడు.
REVANTH REDDY: తమ్ముడికి ఛాన్స్! మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ తమ్ముడు!
అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్‌కు అప్పగించే విషయంపై స్పష్టత లేదన్నాడు. అలాగే కెప్టెన్సీ విషయంలోనూ క్లారిటీ లేదన్నాడు. గత సీజన్‌కు అతడు దూరమవ్వడంతో డేవిడ్ వార్నర్ సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. పంత్ ఏ సామర్థ్యంతో బరిలోకి దిగుతాడనే విషయం చెప్పలేమనీ, ప్రస్తుతానికి బాగానే పరిగెత్తుతున్నాడని చెప్పుకొచ్చాడు. పంత్ ఒక డైనమిక్ ప్లేయర్ అని, గత సీజన్‌లో అతడిని చాలా మిస్ అయ్యామన్నాడు. గత 12-13 నెలలు అతడి ప్రయాణం కష్టంగా సాగిందన్న పాంటింగ్.. గొప్ప పోరాటంతో తిరిగి క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడన్నాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీని చేయలేని పరిస్థితి వస్తే వార్నర్ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడని పాంటింగ్ చెప్పాడు.
ఒకవిధంగా పంత్ రీఎంట్రీ సంతోషాన్నిచ్చేదే అయినా వికెట్ కీపింగ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. కీపింగ్ కూడా చేసి సత్తా చాటితే వరల్డ్ కప్ జట్టులో సులువుగా చోటు సంపాదిస్తాడని చెబుతున్నారు. కేవలం బ్యాటర్‌గానే మెగాటోర్నీకి తీసుకోవాలంటే పంత్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.