Rishabh Pant: వరల్డ్ కప్ టీమ్‌లో వికెట్ కీపర్ బెర్త్ అతనిదేనా..?

రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గతంలో మాదిరిగానే చెలరేగిపోతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో రాణిస్తున్నాడు. దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 06:55 PM IST

Rishabh Pant: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐపీఎల్ 17వ సీజన్ లో అదరగొడుతున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గతంలో మాదిరిగానే చెలరేగిపోతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో రాణిస్తున్నాడు. దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు.

MS DHONI: ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా..? రైనా ఏమన్నాడంటే..

ఈ సీజన్‌లో మెరుపు స్టంపింగ్స్, చురుకైన వికెట్ కీపింగ్‌తో అదరగొడుతున్నాడు. అతడి విన్యాసాలు చూసిన ఫ్యాన్స్.. అసలు పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. గుజరాత్ తో మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను రిషభ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అందుకుని ఆశ్చర్య పరిచాడు. అలాగే స్టబ్స్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్‌లను తన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. వాస్తవానికి పంత్ ఈ సీజన్‌లో వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అని విషయంపై అనుమానం ఉండేది.

కానీ తొలి మ్యాచు నుంచే వికెట్ల వెనకాల నిల్చున్న పంత్.. మునుపటి స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు మెసేజ్ పంపించాడు. మరో పది రోజుల్లో టీ20 ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక ఉండనుంది. ఈ ప్రదర్శనతో రిషభ్ ఆ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.