Rishabh pant, Dhoni : రిషబ్ పంత్ సంచలన కామెంట్స్

కార్ యాక్సిడెంట్ (Car Accident) లో తీవ్ర గాయాలై దాదాపు ఏడాది తర్వాత కోలుకున్న టీమిండియా(Team India)కు వికెట్ కీపర్ రీ ఎంట్రీ కోసం సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ మళ్లీ గ్రౌండ్ లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను పంత్ పంచుకున్నాడు.

 

 

కార్ యాక్సిడెంట్ (Car Accident) లో తీవ్ర గాయాలై దాదాపు ఏడాది తర్వాత కోలుకున్న టీమిండియా(Team India)కు వికెట్ కీపర్ రీ ఎంట్రీ కోసం సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ మళ్లీ గ్రౌండ్ లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను పంత్ పంచుకున్నాడు. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో (MS Dhoni) తన అనుబంధం మాటల్లో చెప్పలేనన్నాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గురించి మహీ భయ్యాతో కచ్చితంగా పంచుకుంటానని తెలిపాడు. అయితే ధోనితో తన ఆట తీరును పోల్చడం మాత్రం తనకు నచ్చదంటూ పంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇలాంటి పోలికలు, విమర్శలు తన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపేవన్నాడు రిషభ్‌ పంత్‌. ఇలాంటి పోలికల వల్ల చాలాసార్లు బాధపడ్డాననీ, ఒత్తిడిని తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు. ధోని దగ్గర ఎలాంటి విషయాలనైనా చర్చించగల చనువు తనకు ఉందని తెలిపాడు.
ఐపీఎల్‌లో వికెట్‌ కీపింగ్‌ చేసినపుడు కంటే టీమిండియాకు ఆడినపుడు ఎక్కువగా ఒత్తిడిలో కూరుకుపోతున్నాను భయ్యా అని ఓసారి ధోనికి చెప్పానని పంత్ గుర్తు చేసుకున్నాడు.

అంతర్జాతీయ మ్యాచ్‌ అన్న విషయం మర్చిపోయి లీగ్‌ మ్యాచ్‌ ఆడినట్లే స్వేచ్ఛగా ఆడాలని ధోనీ ఇచ్చిన సలహా తన కెరీర్ ను మార్చేసిందని చెప్పాడు. 2022లో కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ పంత్‌.. ఐపీఎల్‌ 2024త (IPL2024) సీజన్ తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన పంత్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు.