Rishabh Pant: పంత్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆరోజే.. వికెట్ కీపర్ రీఎంట్రీపై దాదా కీలక వ్యాఖ్యలు

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు మార్చి 5న ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పాడు. ఈ టెస్టులో పంత్ కచ్చితంగా పాస్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 02:07 PM IST

Rishabh Pant: ఐపీఎల్ 17వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలవడంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు మార్చి 5న ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పాడు. ఈ టెస్టులో పంత్ కచ్చితంగా పాస్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ తన ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఢిల్లీ కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బ్యాకప్ గురించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు దాదా.

Anant Ambani: ధోనీ,బ్రావో దాండియా స్టెప్స్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో జోష్

గాయం నుంచి కోలుకున్న అతడిపై పనిభారం విషయంలో జాగ్రత్త వహిస్తామని వ్యాఖ్యానించాడు. పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌‌ పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పంత్ ఢిల్లీ క్యాంప్‌లో జాయిన్ అవుతాడనీ, అతడిని మ్యాచ్‌ మ్యాచ్‌కు పరిశీలిస్తామని చెప్పాడు. ఇక ఢిల్లీ వికెట్ కీపింగ్ ఆప్షన్లపైనా దాదా మాట్లాడాడు. ప్రస్తుతం బ్యాకప్‌గా కుమార్ కుషాగ్ర, రికీ భుయ్ ఉన్నారనీ, వాళ్లు కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారన్నాడు. అయితే పంత్ రీఎంట్రీ జట్టుకు బలాన్నిస్తుందని, అతడు పూర్తి సీజన్ ఆడతాడని ఆశిస్తున్నట్టు గంగూలీ చెప్పుకొచ్చాడు.

2022 ఏడాది ఆఖర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ ఆ తర్వాత నుంచి ఆటకు దూరమయ్యాడు. పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించాడు. కాగా గత సీజన్‌లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగIన నుంచి రెండో స్థానంలో నిలిచింది.