Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం..?

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం పడే అవకాశం కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 02:12 PM IST

Rishabh Pant: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో స్లో ఓవర్‌రేట్ అన్ని జట్ల కెప్టెన్లకు తలనొప్పిగా మారింది. గతంతో పోలిస్తే బీసీసీఐ ఈసారి నిబంధనలు కఠినతరం చేయడంతో వారికి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మ్యాచ్ పరిస్థితులను అనుసరిస్తూ బౌలర్లను ఉపయోగించుకునే క్రమంలో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి కావడం లేదు.

IPL 2024 : తిలక్‌ వర్మే ఓటమికి కారణమంట.. తెలుగోడంటే చిన్నచూపా హార్థిక్‌..

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం పడే అవకాశం కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. ఐపీఎల్‌ రూల్స్ ప్రకారం వ‌రుస‌గా మూడో సారి స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాతో పాటు ఒకమ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒక‌వేళ అదే జ‌రిగితే పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ద‌ప‌రి మ్యాచ్‌కు దూర‌మ‌య్యే ఛాన్స్ ఉంది. కాగా ఫస్టాఫ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ సెకండాఫ్‌లో సత్తా చాటుతోంది.

అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్ధానానికి చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను ఢిల్లీ స‌జీవంగా నిలుపుకుంది.