నీటికొలనులో వేట సింహం కమ్ బ్యాక్ కోసం రిషబ్ సాహసాలు

కార్ ఆక్సిడెంట్ లో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెల్లిగా కోలుకుంటున్నాడు.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 05:19 PM IST

తన హెల్త్ ఇంఫ్రూమెంట్ గురించి అభిమానులతో ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్, ఇప్పుడు తాజాగా ఇంకో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. నెల రోజుల క్రితం పంత్ తన ఇన్ స్టా గ్రామ్ లో.. ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా అని రాసుకొచ్చిన పంత్, మొదట్లో ఉత్తర ఖండ్ హాస్పిటల్ లోనే చికిత్స పొందగా, మెరుగైన వైద్య సదుపాయాల కోసం, బీ సి సి ఐ అతన్ని, ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రికి తరలించింది. రిషబ్ సాధన చూస్తుంటే, అనుకున్న దానికంటే ముందే రిషబ్ కోలుకునేలా కనిపిస్తున్నాడు అని, నియమిత డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దురదృష్ట సంఘటన కారణంగా, రిషబ్ ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇంకొన్ని వారాల్లో మొదలుకానున్న ఐ పి ఎల్ మెగా ఈవెంట్ కు కూడా పంత్ అందుబాటులో లేకున్నాడు. అయితే, ఇవన్నీ కాకుండా.. ఈ ఏడాది చివర్లో వస్తున్న ఐ సి సి వన్ డే వరల్డ్ కప్ కోసం పంత్ అన్ని విధాలా సన్నద్ధమవుతున్నట్టు చెప్పకనే చెప్తున్నాడు, ఈ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మెన్. రిషబ్ పంత్ స్థానానికి పోటీగా ఉన్న శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ లు పంత్ వస్తే గనక పక్కకు తప్పుకోక తప్పదు అని, టీమిండియా అభిమానులు కొందరు ముచ్చటిస్తున్నారు.