Rohith: ఆసియా కప్ ఫైనల్ జట్టు నేపాల్ కెప్టెన్ గా రోహిత్

ఆసియా కప్‌కు నేపాల్‌ జట్టు తొలిసారి అర్హత సాధించిన విషయం తెలిసిందే. 2023 ఆసియా కప్ కోసం నేపాల్ తమ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 06:07 PM IST

ఆసియా కప్‌కు నేపాల్‌ జట్టు తొలిసారి అర్హత సాధించిన విషయం తెలిసిందే. 2023 ఆసియా కప్ కోసం నేపాల్ తమ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఐపీఎల్ స్టార్‌, స్పిన్నర్ సందీప్ లామిచానే జట్టులో చోటు దక్కించుకున్నాడు. నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు రోహిత్ పాడెల్ ఎంపికయ్యాడు. నాయకత్వ నైపుణ్యాలు మరియు అసాధారణమైన ప్రతిభ కారణంగానే రోహిత్, నేపాల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్, కుసల్ భుర్టెల్ మరియు కుశాల్ మల్లా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. వీరు నేపాల్ బ్యాటింగ్ భారంను మోయనున్నారు.

బౌలింగ్ విభాగంలో సందీప్ లామిచానే, కరణ్ కేసీ మరియు సోంపాల్ కమీల ఉన్నారు. నేపాల్ జట్టు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తుంది. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నేపాల్‌ రాణించలేదు. పాకిస్తాన్-ఏ, భారత్‌-ఏ జట్ల చేతిలో ఓటమి పాలైంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై మాత్రం అద్భుత విజయం సాధించింది. ఇక ఆసియా కప్‌ 2023లో నేపాల్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 4న శ్రీలంకలోని క్యాండీలో భారత్‌తో ఆడుతుంది. సరిగ్గా ద్రుష్టి పెడితే నేపాల్ జట్టు, ఆఫ్ఘానిస్తాన్ మాదిరిగానే సంచలనాలు సృష్టించే అవకాశం కూడా ఉంది అని, క్రికెట్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.