రిస్క్ తీసుకుంటేనే కిక్ కాన్పూర్ విజయంపై రోహిత్

కాన్పూర్ టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసింది. దూకుడైన బ్యాటింగ్ కు స్పిన్నర్ల మ్యాజిక్ తోడవడంతో బంగ్లాదేశ్ పై ఘనవిజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - October 1, 2024 / 05:09 PM IST

కాన్పూర్ టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ లో బంగ్లాను చిత్తు చేసింది. దూకుడైన బ్యాటింగ్ కు స్పిన్నర్ల మ్యాజిక్ తోడవడంతో బంగ్లాదేశ్ పై ఘనవిజయాన్ని అందుకుంది. కోచ్ గంభీర్ వ్యూహం, కెప్టెన్ రోహిత్ దూకుడైన కెప్టెన్సీతో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఈ విజయంపై కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిస్క్ తీసుకుంటేనే ఒక్కోసారి విజయాలు సాధించగలమన్నాడు. పైగా తమ ముందు మరో ఆప్షన్ కూడా లేదని చెప్పుకొచ్చాడు. రెండున్నర రోజుల ఆట రద్దైపోయిందని, నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడలేదన్నాడు. ముందు వాళ్లను త్వరగా అవుట్‌ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న తాము తర్వాత బ్యాటింగ్ లో దూకుడుగా ఆడామని చెప్పాడు.

ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకెళ్ళామన్న రోహిత్ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ పై ప్రశంసలు కురిపించాడు. అతనొక అద్బుతం అంటూ కితాబిచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడిన అనుభవం అతడికి ఉందని, మేనేజ్‌మెంట్‌ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడని ప్రశంసించాడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్‌ చేయగల ఫిట్‌నెస్‌ అతడి సొంతమంటూ రోహిత్ ఆకాశ్ దీప్ ను మెచ్చుకున్నాడు. కాగా బెంచ్ స్ట్రెంత్ ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్ళు గాయాల బారిన పడే అవకాశముందన్నాడు.