ROHIT SHARMA: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత పలువురు సీనియర్ క్రికెటర్లు రెస్ట్ తీసుకున్నారు. నిజానికి మెగా టోర్నీ ఆరంభానికి ముందే సీనియర్ల భవిష్యత్తుపై చర్చ జరిగింది. రోహిత్ శర్మ, కోహ్లీ.. టీ20 కెరీర్ ముగిసినట్టేనని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరూ ఆడతారా.. లేదా.. అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
MS DHONI: ధోనీకి ఇదే చివరి సీజనా.. మహి ఏమన్నాడంటే ?
ముఖ్యంగా టీ20 కెప్టెన్సీ పగ్గాలు హార్ధిక్ పాండ్యాకు పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నారన్న ఊహాగానాల మధ్య రోహిత్ గుడ్ బై చెప్పడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు. కోహ్లీ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉన్నా.. ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుంటే రోహిత్ మాత్రం ఆడటం కష్టమని కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన హిట్ మ్యాన్‌కు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. వచ్చే వరల్డ్ కప్‌లో జట్టును నడిపిస్తారా అన్న ప్రశ్నకు రోహిత్ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ‘మీరు నా నుంచి ఎలాంటి సమాధానం కోరుకుంటున్నారో నాకు తెలుసు. త్వరలోనే మీకు జవాబు దొరుకుతుంది’ అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు.
సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలన్న లక్ష్యం ఈ సారి నెరవేర్చుకుంటామని భారత కెప్టెన్ చెప్పాడు. కాగా రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్ దాదాపు ముగిసినట్టేనని చెప్పొచ్చు. గత కొంతకాలంగా టీ20 సిరీస్‌లకు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ ఎంపిక చేయట్లేదు. సీనియర్లకు రెస్ట్ ఇచ్చామని చెబుతున్నా.. ఓవరాల్‌గా 2024 టీ20 వరల్డ్ కప్‌కు పూర్తి యువ జట్టునే ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది.