Rohit Sharma: వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం సానుకూలాంశమని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఈ నెంబర్ వన్ ర్యాంక్‌తో జట్టుకు ఒరిగేది ఏం లేదని, ప్రస్తుత కాలంలో ఉంటూ మంచి క్రికెట్ ఆడితేనే విజయం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.
నెంబర్ వన్ ర్యాంక్‌తో తమకు ఏం కొమ్ములు రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ ప్లేయర్. అతని అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్దంగా ఉంటాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌లో వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాడు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ లో, అశ్విన్ సీనియారిటీ తమకెంతో ఉపయోగపడుతుందని, టీమిండియా కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
భారత్ కి సంబంధించి, బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలు రెండు జోడుగుర్రాల్లా పరిగెడతాయని రోహిత్ శర్మ తన స్ట్రాటజీస్ ను మీడియాతో పంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.