T20 WORLD CUP: ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ 20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ, రోహిత్

గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌‌కు ప్రిపరేషన్ కోసం టీ ట్వంటీలు ఆడలేదు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం టీమిండియా టార్గెట్‌గా ఉంది.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 01:50 PM IST

T20 WORLD CUP: టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి పుష్కర కాలం దాటిపోయింది. ఎప్పటికప్పుడు అంచనాలతో బరిలోకి దిగుతున్నా.. టైటిల్ వేటలో నిరాశే మిగులుతోంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశం తృటిలో చేజారిపోగా.. కొత్త ఏడాదిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎదురు చూస్తోంది. అయితే సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో ఆడటంపై కొంత కాలంగా సస్పెన్స్ నెలకొంది. బీసీసీఐ సెలక్టర్లు పలు సీరీస్‌లకు వీరిద్దరినీ ఎంపిక చేయకపోవడంతో కోహ్లీ, రోహిత్.. టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు.

Pushpa 2: పుష్ప 2 రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?

అయితే వీరిద్దరూ టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఆడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికా వెళ్తన్నాడు. క్లారిటీ కోసం ఇరువురితోనూ చర్చించనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌, ఆ వెంటనే ఐపీఎల్ ప్రారంభమవనుండడంతో ఈ లోగానే ఇద్దరి అభిప్రాయం తీసుకోవాలని అగార్కర్ భావిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నారు. కాగా గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌‌కు ప్రిపరేషన్ కోసం టీ ట్వంటీలు ఆడలేదు.

ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం టీమిండియా టార్గెట్‌గా ఉంది. దీంతో సీనియర్లు కోహ్లీ, రోహిత్ ఆడతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కాగా వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 4న టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది.