ROHIT SHARMA: వన్డే ప్రపంచకప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 61 పరుగులతో శర్మ తన దూకుడు ప్రదర్శించాడు.
Guvvala Balaraju: గువ్వల బాలరాజు ప్రచారానికి వెళ్తే ముఖం మీద తలుపులు వేస్తున్నారు
ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది రోహిత్ 60 సిక్స్‌లతో ఆ రికార్డును అధిగమించాడు. ఈ వరల్డ్ కప్‌లోనే హిట్‌మ్యాన్ 24 సిక్స్‌లు బాదడం విశేషం. వన్డేల్లో ఓపెనర్‌గా 14వేల పరుగుల మైలురాయిని కూడా రోహిత్ దాటేశాడు. భారత్ తరఫున ఈ రికార్డును సాధించిన మూడో బ్యాటర్ రోహిత్.
ఈ జాబితాలో భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ 15,335 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నెదర్లాండ్స్‌తో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు.