ROHIT SHARMA: రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులు.. చరిత్ర సృష్టించడం ఖాయమా..?

అత్యధిక టీ ట్వంటీ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ‌తో సహా ఐదుగురి పేరిట ఉంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:24 PM IST

ROHIT SHARMA: భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. మెగా టోర్నీకి ముందు ఏకైక సిరీస్ కావడంతో సత్తా చాటేందుకు భారత్ రెడీ అయ్యింది. దాదాపు ఏడాది తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ ట్వంటీ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి వీరిద్దరి పైనే ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ఖలో మెరుపులు మెరిపించిన హిట్ మ్యాన్ అఫ్గాన్ సిరీస్‌లో పలు రికార్డులు బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్..? ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్

ఇప్పటివరకు 51 టీ ట్వంటీల్లో భారత్ కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ 39 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అయితే అత్యధిక టీ ట్వంటీ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ‌తో సహా ఐదుగురి పేరిట ఉంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు. కెప్టెన్సీలోనే కాదు కొన్ని వ్యక్తిగత రికార్డులకూ రోహిత్ చేరువలో ఉన్నాడు. మరో 44 పరుగులు సాధిస్తే టీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత్ కెప్టెన్‌గా రికార్డులకెక్కుతాడు. అలాగే టీ ట్వంటీల్లో నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. రోహిత్ మరో 147 పరుగుల చేస్తే నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకుంటాడు.

తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డ్ సృష్టిస్తాడు. విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్నాడు. ఇక టీ20ల్లో సిక్సర్ల సెంచరీకి కూడా హిట్ మ్యాన్ చేరువలో ఉన్నాడు. మరో 18 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ పొట్టి క్రికెట్ లో 100 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు. రీ ఎంట్రీలో రోహిత్ ఈ రికార్డులు అందుకుంటాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.