Rohit Sharma: టీమిండియా బ్రహ్మాస్త్రం అతడే.. సెమీస్‌లోనూ విజృంభిస్తే..

2011లో చాంపియన్‌గా నిలిచిన భారత్.. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్‌కు చేరింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో.. 2019లో కివీస్ చేతిలో భారత్ సెమీస్‌లో ఓడింది. కానీ, ఈ సారి ఆ గండాన్ని దాటేలా ఉంది టీమిండియా.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 04:10 PM IST

Rohit Sharma: ప్రపంచకప్‌లో లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఓటమే ఎరుగని టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌‌ను ఢీ కొట్టబోతోంది. అయితే.. సెమీఫైనల్ మ్యాచులు టీమిండియాకు అంతగా కలిసి రావు. 2011లో చాంపియన్‌గా నిలిచిన భారత్.. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్‌కు చేరింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో.. 2019లో కివీస్ చేతిలో భారత్ సెమీస్‌లో ఓడింది.

REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి

కానీ, ఈ సారి ఆ గండాన్ని దాటేలా ఉంది టీమిండియా. ఎందుకంటే టీమిండియా అతి పెద్ద బలం మనకు అండగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ బలం ఎవరో కాదు రోహిత్ శర్మ. అవును మీరు వింటుంది నిజమే. రోహిత్ శర్మ దూకుడు, నిస్వార్ధమే టీమిండియాకు శ్రీరామ రక్ష అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వాళ్లు ఇలా అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఇన్‌స్వింగర్‌కు బలైనా.. ఆ తర్వాత బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు రోహిత్. అఫ్గాన్‌పై పోరులో తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో వరల్డ్‌ కప్‌లోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఆ తర్వాత పాకిస్థాన్ బౌలర్లపై అదే షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను వన్ సైడ్ వార్ చేశాడు రోహిత్. ఆ తర్వాత కూడా చాలా మ్యాచుల్లో తనదైన దూకుడు ఆటతో ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేశాడు రోహిత్. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

అయితే.. తన పర్సనల్ రికార్డులకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా.. జట్టు కోసమే ఆడుతున్నాడు రోహిత్. ఆడిన 9 మ్యాచుల్లో రోహిత్ 503 పరుగులు చేశాడు. ఇది చాలు రోహిత్.. ఎంత ఫాస్ట్‌గా ఆడుతున్నాడో తెలుసుకోవడానికి. ఈ దూకుడే టీమిండియాకు బలంగా మారింది. రోహిత్‌కి వన్డే ప్రపంచ కప్‌ మెగా టోర్నీల్లో అద్భుత రికార్డు ఉంది. ఇప్పుడు ఆడేది మూడో వరల్డ్‌ కప్‌ అయినా సరే.. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన వారికి కూడా సాధ్యం కాని విధంగా ఏడు సెంచరీల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక.. కెప్టెన్సీ విషయంలో కూడా తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మ ఫీల్డ్ సెట్టింగ్, బౌలర్లను వినియోగించుకుంటున్న తీరు, డీఆర్ఎస్ వాడిన విధానం హైలెట్ అని చెప్పవచ్చు. సెమీస్‌లో రోహిత్ ఒక్కడు నిలబడితే, కివీస్‌కు కొత్త తలనొప్పి తప్పదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.