ROHIT SHARMA: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహానికి ధీటుగా బదులిచ్చి సిరీస్ కైవసం చేసుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా మెక్ కల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. బజ్‌బాల్ గేమ్‌తో టెస్ట్‌లకు సరికొత్త ఊపును తీసుకొచ్చిన ఈ ఇంగ్లండ్ ద్వయం.. బజ్‌బాల్ వ్యూహంతో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.
Pankaj Udhas: ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత..
న్యూజిలాండ్, పాకిస్థాన్‌లపై సంచలన విజయాలు అందుకున్న ఇంగ్లీష్ టీమ్.. యాషెస్ సిరీస్‌ను సమం చేసింది. ఇప్పడు భారత్‌తో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. రాంచీ వేదికగా ఉత్కంఠగా సాగిన నాలుగో టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో బజ్‌బాల్ అప్రోచ్‌తో ఆడుతున్న ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ ఘనతను అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.
దీనికంతటికి రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. బజ్‌బాల్ యుగంలో ఇంగ్లండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించిన కెప్టెన్, బెన్ స్టోక్స్‌కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథిగా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే రాంచి టెస్టులో రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు.