ROHIT SHARMA: భారత క్రికెట్‌కు మంచిది కాదు.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్

తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించాడు. ఈ నిబంధన భారత క్రికెట్‌కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్‌రౌండర్లను వెలుగులోకి రాకుండా తెస్తుందని రోహిత్ వ్యాఖ్యానించాడు.

  • Written By:
  • Updated On - April 18, 2024 / 06:59 PM IST

ROHIT SHARMA: ఐపీఎల్ 17వ సీజన్ లో ఇప్పటి వరకూ బ్యాటర్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 277, 287 స్కోర్లతో కొత్త చరిత్ర సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు కూడా భారీ స్కోర్లు సాధించాయి. బ్యాటర్ల విధ్వంసానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఓ కారణమని చర్చ జోరుగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పాడు.

SS RAJAMOULI: టైటిల్ రాబోతోంది.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించాడు. ఈ నిబంధన భారత క్రికెట్‌కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్‌రౌండర్లను వెలుగులోకి రాకుండా తెస్తుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని అన్నాడు. ఇది ఆల్‌రౌండర్లను హోల్డ్‌లో ఉంచుతోందన్నాడు ఇది మనకే మంచిది కాదనీ, ఈ రూల్‌తో 12 మంది ప్లేయర్లతో ఆట వినోదాత్మకంగా మారిందన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్ కేవలం బ్యాటర్ లేదా బౌలర్‌గా మాత్రమే జట్టులో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ సీజన్‌లో దూబె బ్యాటుతో అద్భుతాలు చేస్తున్నప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు. అయితే మరో నెలన్నర రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత్‌కు ఆల్‌రౌండర్లను ఎంపిక చేయడంలో ఈ నిబంధన ఆటంకంగా మారుతోంది. ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సెలక్టర్లు తలపట్టుకుంటున్నారు.