Rohit Sharma: రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డ్.. ఆసియా కప్పు గెలిస్తే..

ఇప్పటి వరకు మహ్మద్ అజహరుద్దీన్, ఎంఎస్ ధోనీ మాత్రమే భారతదేశానికి రెండుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను అందించిన కెప్టెన్లుగా నిలిచారు. కాగా, ఈ ఏడాది రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా రెండో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 03:41 PM IST

Rohit Sharma: ఆసియా కప్ 2023 ఈనెల 30 నుంచి మొదలుకానుంది. కాగా, భారత జట్టు ఇప్పటివరకు అత్యధికంగా 7 సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆసియా కప్ 2023 టోర్నీ ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అంతకుముందు 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక టైటిల్‌ను గెలుచుకుంది.

భారత జట్టు చివరిసారిగా 2018లో ఆసియా కప్‌ గెలుచుకుంది. వెటరన్‌ సునీల్‌ గవాస్కర్‌ సారథ్యంలో భారత జట్టు తొలి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. 1984లో ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సునీల్ గవాస్కర్ 1984లో మొదటి ఆసియా కప్ అందించగా, దిలీప్ వెంగ్‌సర్కార్ 1988లో భారత్‌కు రెండో ఆసియా కప్ తీసుకొచ్చాడు. మహ్మద్ అజారుద్దీన్ 1991, 1995 సంవత్సరాలలో రెండు సార్లు, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని 2010, 2016 లలో ఆసియా కప్ అందించారు. చివరగా రోహిత్ శర్మ 2018లో ఈ ఘనత సాధించాడు.

ఇప్పటి వరకు మహ్మద్ అజహరుద్దీన్, ఎంఎస్ ధోనీ మాత్రమే భారతదేశానికి రెండుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను అందించిన కెప్టెన్లుగా నిలిచారు. కాగా, ఈ ఏడాది రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా రెండో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా రెండవ ఆసియా కప్‌ను గెలవగలడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.