Rohit Sharma: ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటకు రోహిత్ ఫీల్డింగ్‌కు సైతం రాలేదు.
Ravichandran Ashwin: వందో టెస్టులో అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
హిట్‌మ్యాన్ వెన్ను నొప్పితో బాధపడతున్నట్లు బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో మూడు నెలలలో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న వేళ ఈ మెగా టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఈ లీగ్‌లో సెకండ్ హాఫ్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.కాగా ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించింది.
రోహిత్ స్ధానంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ముంబై ట్రేడింగ్ చేసుకుంది. కాగా మార్చి 22 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, చెన్నై జట్లు తలపడనున్నాయి.