Yashasvi Jaiswal: ఓపెనింగ్ అయితే ఓకే.. జైస్వాల్ విషయంలో జర జాగ్రత్త

కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ పాత గేమ్‌ను గుర్తుకు తెచ్చారు. అయితే జట్టు రన్ మెషీన్ విరాట్ కోహ్లి మాత్రం మళ్లీ తన పాత తప్పును పునరావృతం చేసి పెవిలియన్ చేరగా.. టెస్టు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు తీవ్రంగా నిరాశపరిచారు.

  • Written By:
  • Publish Date - July 8, 2023 / 04:05 PM IST

Yashasvi Jaiswal: వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా డొమినికాకు చేరుకుంది. అయితే అంతకు ముందు బార్బడోస్‌లో వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన భారత్.. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు రెండు జట్లుగా విడిపోయి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ పాత గేమ్‌ను గుర్తుకు తెచ్చారు.

అయితే జట్టు రన్ మెషీన్ విరాట్ కోహ్లి మాత్రం మళ్లీ తన పాత తప్పును పునరావృతం చేసి పెవిలియన్ చేరగా.. టెస్టు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడానికి మేనేజ్‌మెంట్ జైస్వాల్‌తో పాటు ఈ ఇద్దరిని ప్రాక్టీస్ మ్యాచ్‌లో అనుమతించింది. అయితే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు సెలక్షన్ బోర్డును ఆకట్టుకోలేకపోయారు. జులై 7న ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, జైస్వాల్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా రోహిత్ జట్టు 64 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రవిచంద్రన్‌ అశ్విన్‌ నేతృత్వంలోని టీమిండియా 55 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

రుతురాజ్ 9 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ ముగించాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 38 పరుగులు చేశాడు. కిషన్ వికెట్ తీసిన ముఖేష్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లతో కలిసి తొలి టెస్టులో పేస్ అటాక్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో రాణిస్తున్న జైస్వాల్ నంబర్ 3లో ఆడతాడా..? లేక ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా అనేది వేచి చూడాల్సిందే.