Rohit’s injury : రోహిత్ కు గాయం… టెన్షన్ లో టీమిండియా ఫాన్స్

ఐపీఎల్ (IPL) ముగిసిన వారం రోజుల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యం వహిస్తున్నాడు.

 

 

ఐపీఎల్ (IPL) ముగిసిన వారం రోజుల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యం వహిస్తున్నాడు. అయితే రోహిత్ కి గాయం అయిందన్న వార్తలతో అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ (Calcutta Knight Riders) తో మ్యాచ్‌లో ముంబై తుది జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఛేజింగ్‌‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బ్యాటింగ్‌‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు నుంచి రోహిత్ తప్పించడానికి కారణాలేంటని చర్చ మొదలైంది. లీగ్ మొత్తానికి రోహిత్ దూరం కానున్నాడా అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా రోహిత్ రావడానికి గల కారణాలను ఆ జట్టు స్పిన్నర్ పీయూష్ చావ్లా వివరించాడు. వెన్నునొప్పితో బాధ పడుతున్న హిట్‌మ్యాన్‌ను ఫీల్డింగ్‌కు దూరంగా ఉంచాలని భావించామని చావ్లా తెలిపాడు. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులోనే ఉంటాడని హింట్ ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జరగనున్న ఈ సమయంలో రోహిత్‌కు తీవ్ర గాయమైతే, మెగా టోర్నీకే దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రోహిత్ తేలికపాటి నొప్పితోనే బాధపడుతున్నాడని చావ్లా స్పష్టం చేయడంతో టీమిండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.