RCB TROLL: బాబూ ఇదేం బౌలింగ్.. అమ్మాయిలను తీసుకోండి అంటూ ఎగతాళి

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. పేలవ బౌలింగ్‌తో 183 పరుగుల పోరాడే లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయలేకపోయారు.

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 05:35 PM IST

RCB TROLL: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. చెత్త బ్యాటింగ్‌, పేలవ బౌలింగ్‌తో కోల్ కత్తా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఓడిన తొలి జట్టుగా నిలిచింది. అయితే ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లను సొంత అభిమానులే ఏకీపారేస్తున్నారు.

Daniel Balaji: మానవత్వం.. డేనియల్‌ బాలాజీ నేత్ర దానం

ముందుగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. పేలవ బౌలింగ్‌తో 183 పరుగుల పోరాడే లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా.. టూ మచ్ పేస్‌గా ఉండటంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేయలేక పవర్ ప్లేలోనే 85 పరుగులు ఇచ్చి చేతులెత్తేసారు. . స్లో కట్టర్స్ వర్క్ అవుతున్నాయనే విషయం తెలిసి కూడా బౌన్సర్లు, ఫాస్ట్ బాల్స్‌తో మూల్యం చెల్లించుకున్నారు.

జట్టులో ఉన్న బౌలర్ల వల్ల చేతకావడం లేదని, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీని గెలిపించిన ఎల్లిస్ పెర్రీ, శ్రేయాంక్ పాటిల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు. శ్రేయాంక పాటిల్ స్పిన్నర్లు లేని లోటును తీరిస్తే.. ఎల్లిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని సలహాలు ఇస్తున్నారు.