MS Dhoni: ధోనీ లెక్క ఈసారి తప్పిందే..!

రుతురాజ్ కెప్టెన్‌గా బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనక కొండంత అండ, మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్.. లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 02:31 PM IST

MS Dhoni: ఐపీఎల్ 17వ సీజన్‌లో హై స్కోరింగ్ మ్యాచ్‌లు అభిమానులను అలరిస్తున్న్నాయి. తాజాగా చెన్నై, లక్నో మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా జరిగింది. స్టోయినిస్ సంచలన సెంచరీతో లక్నో ఈ మ్యాచ్ గెలిచింది. నిజానికి ధోనీ స్థానంలో బాధ్యతలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్‌గా బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనక కొండంత అండ, మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు.

Shivam Dube: శివ తాండవం ఆడేస్తున్న శివమ్ దూబె

కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్.. లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే గ్రేట్ కెప్టెన్‌గా, మాస్టర్ మైండ్‌గా పేరుగాంచిన ధోని వ్యూహం ఈసారి బెడిసికొట్టింది. చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 రన్స్ అవసరం కాగా.. గైక్వాడ్ ముస్తాఫిజుర్‌కు బంతిని అందించాడు. ఇక్కడే చెన్నై ఓటమి ఖాయమైంది. తన ముందు ఓవర్లోనే ముస్తాఫిజుర్ 15 రన్స్ ఇచ్చాడు. అప్పటికే అతడి బౌలింగ్‌లో దంచికొడుతున్న లక్నో బ్యాటర్ స్టోయినిస్ వరుస బంతుల్లో బౌండరీలు బాది ఇన్నింగ్స్ ముగించాడు.

అయితే దీపక్ చాహర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం ఇక్కడ ధోని చేసిన పెద్ద తప్పని మాజీలు చెబుతున్నారు. అతడు 2 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. ఇలాంటి బౌలర్‌కు చివరి ఓవర్ ఇవ్వాలన్న ఆలోచన గైక్వాడ్‌కు, ధోనికి ఎందుకు రాలేదు అన్నది అర్థం కాలేదు. చాహర్‌కి ఆఖరి ఓవర్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.