దిగ్గజ క్రికెటర్ (Cricketer) సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ సీజన్ (Ranji Season) లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ దారుణంగా విఫలమవుతున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అర్జున్ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జూనియర్ టెండూల్కర్.. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్ రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్.. 9 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు.
ధారళంగా పరుగులిస్తుండటం.. బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకపోవడంతో గోవా కెప్టెన్ అతనికి బౌలింగే ఇవ్వడం లేదు. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో సచిన్ కొడుకు కాకపోయి ఉంటే కనీసం క్లబ్ స్థాయి క్రికెట్ ఆడేందుకు కూడా అర్హత సాధించేవాడు కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ముంబై తరపున ఆరంభించిన అర్జున్.. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబై క్రికెట్ ఆసోషియేషన్ నుంచి ఎన్‌వోసీ తీసుకుని గోవా జట్టుతో చేరాడు. అక్కడ అవకాశాలు వచ్చిననప్పటికీ వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు.