సౌతాఫ్రికా (South Africa) టీ ట్వంటీ లీగ్ (T20 League) లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అదగొట్టింది. ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆల్ రౌండ్ షోతో సత్తా చాటిన సన్ రైజర్స్ ఫైనల్లో 89 పరుగుల తేడాతో గెలిచింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి భారీస్కోర్ అందించారు. చివర్లో హెర్మెన్, కెప్టెన్ మార్‌క్రమ్ మెరుపులు మెరిపించారు. తర్వాత 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ 115 పరుగులకే కుప్పకూలింది.
సన్‌రైజర్స్ (Sunrisers) పేసర్ మార్కో జానెసన్ 5 వికెట్లతో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు బార్ట్‌మన్, వారెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టోర్నీఆద్యంతం పరుగుల వరద పారించిన హెన్రిస్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. సన్ రైజర్స్ టీమ్ ఈ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్ (T20 League Title) ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకుంది.