ఇద్దరి మధ్య అదే ముఖ్యం విరుష్క జోడీ రిలేషన్ షిప్ సీక్రేట్ ఇదే

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 05:58 PM IST

భారత క్రికెట్ లో ఈ ఏడాది ఆఫ్ ది ఫీల్డ్ వార్తలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రౌండ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్న క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నారు. మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, హార్థిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ స్టోరీలే దీనికి ఉదాహరణ… భాగస్వామితో సరైన అవగాహన, ఇతర అంశాల్లో సఖ్యత లేకపోవడమే దీనికి కారణం. అదే సమయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడీ మాత్రం సక్సెస్ ఫుల్ పెయిర్ గా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ సీక్రేట్ ఏంటనేది చూస్తే రెండు విషయాలను చెప్పొచ్చు. మొదటిది ఇద్దరి మధ్య చక్కని అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం… ఎందుకంటే ఇద్దరూ తమ తమ రంగాల్లో టాప్ సెలబ్రిటీలు.. క్రికెటర్ గా ఎప్పుడూ బిజీ షెడ్యూల్ తో కోహ్లీ ఉంటే.. సినిమాలతో అనుష్క బిజీగా ఉండడం కామన్…

కానీ వ్యక్తిగత జీవితాలకు కూడా ఇద్దరూ సమానంగా ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇద్దరి మధ్య అవగాహన లోపం లేకుండా చూసుకోవడం వీరి బంధాన్ని మరింత బలపరిచింది. అలాగే వృత్తిపరంగా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం మరో సక్సెస్ సీక్రేట్. కోహ్లీ చాలా సందర్భాల్లో ఈ విషయాలను చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత తమ కెరీర్ విషయాలను చర్చించే పరిస్థితి ఉండదన్నాడు. విరుష్క జోడీ సాధారణ కుటుంబంలా చక్కని లైఫ్ ను ఆస్వాదించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. అలాగే తమ ప్రైవసీకి సంబంధించి కూడా ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉండడం మరో సక్సెస్ సీక్రేట్..అందుకే బిజీ షెడ్యూల్ నుంచి విరామం దొరికితే కోహ్లీ, తన ఫ్యామిలీని తీసుకుని సెలబ్రిటీలుగా గుర్తించని ప్రదేశాలకు హాలిడే ట్రిప్ వేస్తుంటాడు. ఫ్యూచర్ లో కూడా ఇదే ఫాలో అయ్యేలా లండన్ కు కూడా షిప్ట్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం మీద సెలబ్రిటీల్లో చాలా మందికి విరుష్క జోడీ రిలేషన్ షిప్ ఆదర్శంగా నిలుస్తోంది.