Shaheen Afridi: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కరాచీలో షాహీన్, అన్షాలు వివాహం చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే.
షాహీన్ షా అఫ్రిదీ, అన్షా అఫ్రిదీల వివాహా కార్యక్రమానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మొహ్మద్ రిజ్వాన్ హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు క్రీడాకారులు కూడా హాజరయ్యారు. స్పీడ్‌స్టర్ అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2023లో పాక్ సూపర్-4 నుంచి నిష్క్రమించిన అనంతరం బాబర్, అఫ్రిదీ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకొవడంతో అంతా సెట్ అయినట్టే అనిపిస్తోంది.
షాహీన్ ఆఫ్రిది, అన్షాల మొదటి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ వివాహానికి కొద్ది మంది సన్నిహితులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఈ జంట తమ పెళ్లిని ఘనంగా జరుపుకోవాలనుకుందట. అందుకే మరోసారి పెళ్లిని ఘనంగా ప్లాన్ చేశారని సమాచారం.