వరల్డ్ కప్ ఫైనల్లో సూర్య క్యాచ్ మిల్లర్ నాటౌట్ అంటూ షంషి పోస్ట్

ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ను అభిమానులు ఎవ్వరూ అంత సులువుగా మరిచిపోరు. అపజయమే లేకుండా టైటిల్ పోరుకు దూసుకెళ్ళిన భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన పోరు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది.

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 08:45 PM IST

ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ను అభిమానులు ఎవ్వరూ అంత సులువుగా మరిచిపోరు. అపజయమే లేకుండా టైటిల్ పోరుకు దూసుకెళ్ళిన భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన పోరు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆఖరి ఓవర్లో మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ క్యాచ్ పై సఫారీ అభిమానులు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రూల్స్ ప్రకారం ఒకటికి పదిసార్లు థర్డ్ అంపైక్ చెక్ చేసి ఔట్ గా ప్రకటించినప్పటకీ… బౌండరీ రోప్ జరిపారంటూ సఫారీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా స్పిన్నర్ షంషి కూడా ఈ క్యాచ్ పై స్పందించాడు.

గల్లీ క్రికెట్‌లో బౌండరీ లైన్‌లో అందుకున్న క్యాచ్‌ను కొందరు యువకులు పరీక్షించిన వీడియోను పోస్ట్ చేశాడు.. ఇదే తరహాలో వరల్డ్ కప్ ఫైనల్‌లో పరీక్షిస్తే ఫలితం మరోలా ఉండేదని, మిల్లర్ నాటౌట్ అని షంసీ రాసుకొచ్చాడు. దీనికి టీమిండియా అభిమానులు స్ట్రాంగ్ గానే రియాక్టయ్యారు. కప్ గెలవలేదంటూ చిన్నపిల్లాడిలా ఏడవొద్దంటూ షంషికి కౌంటర్ ఇచ్చారు. అంపైర్లతో పాటు చాలా మంది మాజీ ఆటగాళ్ళు సైతం దీనిని ఔట్ గానే చెప్పారని గుర్తు చేశారు. భారత్ ఫ్యాన్స్ రియాక్షన్ తో మరో పోస్ట్ పెట్టిన షంషీ తాను జోక్ గా వీడియోను అప్ లోడ్ చేశానంటూ యూ టర్న్ తీసుకున్నాడు.