Shayan Jahangir: పుట్టింది పాకిస్థాన్ లో ఆడుతుంది అమెరికా కోసం తర్వాతి విరాట్ కోహ్లీ నేనే అంటూ డైలాగులు

జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నీలో యువ ఆటగాళ్లు సత్తా చాటుకుంటున్నారు. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా 4 వికెట్లు తీయడంతో పాటు.. అజేయంగా సెంచరీ కూడా చేశాడు.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 02:08 PM IST

అయితే మంగళవారమే అమెరికా, నేపాల్ మధ్య కూడా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలిచినప్పటికీ.. అమెరికా తరఫున ఆడుతున్న పాకిస్థానీ ప్లేయర్ షయాన్ జహంగీర్ కూడా అజేయమైన సెంచరీతో చెలరేగాడు. ఇంకా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ విరాట్ ‘కింగ్’ కోహ్లీకి సవాలు విసిరాడు. 79 బంతుల్లో అజేయ సెంచరీ చేసిన షయాన్ జహంగీర్.. ‘కోహ్లీపై ఆడడమే నా ప్రధాన లక్ష్యం. ప్రతి లీగ్‌లోనూ తనలాగే రాణించగల మంచి బ్యాట్స్‌మ్యాచ్ ఉన్నాడని కోహ్లీకి చూపించాలనుకుంటున్నా’నని చెప్పుకోచ్చాడు.

అమెరికా తరఫున 7వ నెంబర్ బ్యాట్స్‌మ్యాన్‌గా వచ్చిన అతను 79 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయమైన సెంచరీ చేశాడు. ఈ ఆటగాడి బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పకోవాలంటే.. జహంగీర్ కరాచీలో జన్మించాడు. పాకిస్థాన్ తరఫున అండర్ 19 క్రికెట్ కూడా ఆడాడు. అయితే అమెరికాలో స్థిరపడిన అతను.. ఇప్పుడు ఆ దేశం తరఫున ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో ఆడుతున్నాడు. కాగా, ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన జహంగీర్ 235 పరుగులు చేశాడు.