పారాఒలింపిక్స్ లో భారత్ చరిత్ర సృష్టించిన శీతల్ దేవి

పారాఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌‌కు తొలి స్వర్ణం అందించాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన శీతల్ దేవి అంచనాలకు తగ్గట్లుగా శుభారంభం చేసింది.

  • Written By:
  • Publish Date - August 30, 2024 / 04:15 PM IST

పారాఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌‌కు తొలి స్వర్ణం అందించాలనే లక్ష్యంగా బరిలోకి దిగిన శీతల్ దేవి అంచనాలకు తగ్గట్లుగా శుభారంభం చేసింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్స్ రౌండ్‌లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. 720కి గాను 703 పాయింట్లు సాధించి నేరుగా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో శీతల్ దేవి అరుదైన రికార్డు నెలకొల్పింది. 700 ప్లస్ పాయింట్లు సాధించిన భారత తొలి మహిళ ఆర్చర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే ఒక్క పాయింటు తేడాతో ప్రపంచ రికార్డు మిస్ అయ్యింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్‌ గిర్డి ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, శనివారం ప్రిక్వార్టర్స్‌లో చిలీ ఆర్చర్ జునిగా లేదా కొరియా ప్లేయర్ చోయ్‌ నా మితో శీతల్‌ తలపడే అవకాశం ఉంది.