మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ప్రతిసారి మొండిచేయే ఎదురైంది. కనీసం ఇండియా- ఏ జట్టుకు కూడా అతడిని ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో గతేడాది ట్విటర్ వేదికగా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షెల్డన్ జాక్సన్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకు వచ్చాడు. సెలక్షన్ విధానంపై నేనెప్పుడూ ఎలాంటి కామెంట్ చేయను. నన్నెందుకు ఎంపిక చేయలేదని అడిగే హక్కు మాత్రం ఉంటుంది కదా! కానీ నేనెప్పుడూ ఏ సెలక్టర్‌ను కూడా ఎప్పుడూ సంప్రదించలేదు.
నన్ను ఎందుకు బలి చేశారని అడుగలేదు. ఒకవేళ నిజంగానే నా ఆట తీరు మరీ అంత ఘోరంగా ఉంటే 90కి పైగా మ్యాచ్‌లు ఎలా ఆడి ఉంటాను. నా సగటు 50. పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్ క్రికెట్లో ప్రభావం చూపగలుగుతున్నా. నిజానికి ఇన్నాళ్లుగా నాకు అండగా నిలుస్తున్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా షా(జయదేవ్ షా, నిరంజన్ షాలను ఉద్దేశించి) కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంది. వంద మ్యాచ్‌లకు నేను చేరువవుతున్నానంటే అందుకు వాళ్లే కారణం. ఏదేమైనా జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్లు మనల్ని విస్మరించినప్పుడు విసుగు, కోపం, అసహనం రావడం సహజమే కదా!’’ అని షెల్డన్ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
“నా వయసును బట్టి కాదు.. నా ఆట తీరును బట్టి నా పేరును పరిశీలనలోకి తీసుకోండి. నాకు వయసైపోయిందన్న మాట వాస్తవమే. కానీ నాకిప్పుడు 35 ఏళ్లే.. 75 కాదు’’ అని జాక్సన్ 2022 ఆగష్టులో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేపథ్యంలో షెల్డన్ జాక్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.