మళ్ళీ బ్యాట్ పట్టనున్న గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ధావన్

అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు.

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 04:24 PM IST

అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. రిటైర్మెంట్ ప్లేయర్స్ కోసం నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ధావన్ బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. రిటైరయిన భారత ప్లేయర్స్ ప్రపంచ క్రికెట్ లో ఏ లీగ్ లోనైనా ఆడే అవకాశముంది. దీనిలో భాగంగానే గబ్బర్ లెజెండ్స్ లీగ్ లో ఆడనున్నాడు. క్రికెట్ ఎప్పుడూ తన లైఫ్ లో ఒక భాగమని, తన పాత స్నేహితులతో కలిసి ఆడనుండడం సంతోషంగా ఉందంటూ గబ్బర్ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ ట్వంటీలు ఆడి 12 వేలకు పైగా పరుగులు చేశాడు.